Posts

Showing posts from April, 2020

అనుభవాల కరోనా (కరోనా కవిత-1)

Image
            * అనుభవాల కరోనా* కరోనా కల్లోలపు అనుభవాలు కనీ వినీ ఎరుగని సమ్మేళనాలు కొత్త ఆచారాలతో సరికొత్త జీవనాలు గుండెలను కదిలించే కారుణ్యపు కథనాలు కొందరికి మోదమైతే మరికొందరికి ఖేదం గత్యంతరము లేని అనివార్యపు నిర్భంధాలు గమ్యం కోసం వలస జీవుల నడక ప్రయాణాలు కొందరికి ఆనందపు సెలవు దినాలు కొందరికి ప్రాణాలే పణమైన పనిదినాలు అజ్ఞాతవాసాలలో ఆకలి కేకలు ఆగిపోయిన జీవనయానాలు అన్నార్తుల కోసం కదిలొచ్చిన మానవత్వం మేమున్నాం మీకంటూ నిలబడిన దాతృత్వం ప్రజలందరి రక్షణకై ప్రభుత్వాల ఆరాటం దేవుళ్ళుగ మారిన మహనీయుల పోరాటం అలుపెరగని రక్కసితో అనునిత్యం సహవాసం సమైక్య సమరం లోను పిసరంత పిడకల వేటలు పొంతనలేని పోలికలు బూజు పట్టిన సందేశాలు అసందర్భపు ప్రేలాపనలు అనుచిత వ్యంగోక్తులు ముసురుకొంటున్న నిరాశపు నీలి మేఘాలు నిర్వేదంలోనూ వీడని మేకపోతు గాంభీర్యాలు చీకటి వెనుక వెలుతురొస్తుంది స్వీయనియంత్రణే శ్రీరామరక్ష ప్రభుత్వ ఆదేశమే కర్తవ్య పాలనం ఆశతో జీవిద్ధాం అప్రస్తుతాలు ఆపేద్ధాం అభాగ్యుల కోసం ఆలోచిద్ధాం రచన: కప్పగంతు జయరామయ్య           పొందూరు Phone : 9912117372 ...