Posts

విషాదపర్వం (కరోనా కవిత - 6)

Image
                   * విషాదపర్వం * ఉన్నచోట ఉపాధిలేక ఊరు విడిచిన వలస కూలీ! బతుకు కోసం మెతుకు వేటకు బయలుదేరిన బడుగు జీవీ! గూడులేని అయినవారు కానరాని భాషరాని చోటుకెళ్ళి కాయకష్టం చేసుకొంటూ కూలిబతుకు బతుకుతుంటే ఉప్పెనల్లే వచ్చిపడిన మాయదారి మహమ్మారి ఉన్నచోట ఉండనీయక సొంతగూటికి చేరనీయక ఆదరించే వారు లేక సేద తీరే నీడ లేక ముందుచూపుగ మానవీయం నీకు భద్రత కల్పించనందున దూరమెంతో తెలిసికూడా  దిక్కుతోచని దీనస్థితిలో గుండె ధైర్యము జారనీయక కాలి నడకను సడలనీయక ఆలుబిడ్డలు వెంటరాగ దారిపట్టిన బాటసారీ! నెత్తిమీద బరువుమూట చంకలోన చంటిబిడ్డ ఎన్ని రోజులు ఎన్ని మైళ్ళని పగలు రాత్రులు పస్తు నడకలు నడచి నడచి కాళ్ళు పగిలిన పంటిబిగువన బాధ భరిస్తూ రోడ్డు మీద బిడ్డ ప్రసవం రైలు కట్టన అయ్య మరణం దరికి చేరని ప్రయాణంలో అడుగడుగున అవాంతరాలు బతుకుటెట్లు చేరుటెట్లను బాధ మనసును కలచి వేయగ ఎవరి కోసం చెమట చిందెనో వారు నిన్ను వదిలి వేసినా సోనుసూద్ జాలిగుండెలో జాలువారిన దయాగుణమూ అక్కడక్కడ మానవత్వం పరిమళించి ఆదరించినా ఛిద్రమైన నీదు బతుకు అనుభవించిన నరకయాతన కరోనా భారతాన కరుణరసాత...

పల్లెవాసం (కరోనా కవిత -5)

Image
కరోనా కవిత - 5 రచనా కాలం = జూన్ 2020                * పల్లెవాసం * వేకువఝామునే నిద్రలేచే పల్లెతల్లి కర్తవ్యాన్ని గుర్తుచేసే కోడికూతలు కిర్రుమని సందడి చేసే బావి గిలకలు వడివడిగా అడుగులేసే కావడి నడకలు జొన్నలు దంచే రోకలి చప్పుళ్ళు పొలమెళ్ళే ఎద్దుల గంటల గణగణలు మచ్చుకైనా కనపడని మార్నింగ్ నడకలు ఒకనాటి శ్రమైక జీవన సౌందర్య పల్లె జీవనం ఆత్మీయ పిలుపుల ఆప్యాయతలు పచ్చదనాల ప్రకృతి రమణీయతలు చెట్టుక్రింద చర్చలలో పంటసాగు ప్రణాళికలు గుడి లోని తాళం భజనల తన్మయత్వాలు పౌరాణిక నాటక పద్యాల రాగాలాపనలు సమిష్టి కుటుంబ మధురానుబంధాలు పెద్దరికాన్ని గౌరవించే సత్సంప్రదాయాలు ఉన్నత జీవనయానానికి మార్గదర్శనాలై మానవ నైపుణ్యాల ఉత్పత్తి కేంద్రమై పట్టణాభివృద్ధికి తానే పునాదులెత్తి అలరించి ఆదర్శమైనది పల్లెవాసం విలాస వ్యామోహమో ఉపాధి అవసరమో తన బిడ్డలు రెక్కలొచ్చి తనను విడిచి నగరాలకు పయనిస్తూ వలస పోతున్నా పరిస్థితుల ప్రాబల్యానికి తలొగ్గి గత కాలపు వైభవ చిహ్నంగా మిగిలి ఆనంద భాష్పాలతో ఆశీర్వదించింది ఆధునికతకిదే అసలైన మార్గమని నగరవాసమే నాగరిక జీవనమని తమకు తామే నాగరికులగా ఊహించుకొని ప...

నివారణాన్వేషణ (కరోనా కవిత -4)

Image
           * నివారణాన్వేషణ * కరోనాతో కలసి సహజీవనం అనివార్యమంటోంది జనవాక్యం ఎన్నాళ్ళీ మాస్కు ధారణలు ఎన్నాళ్ళీ కరశుద్ధి లేపనాలు ఎన్నాళ్ళీ భౌతికదూర వియోగాలు ఎన్నాళ్ళీ బతుకుబాట నిరోధకాలు తల్లీబిడ్డలు భార్యాభర్తలు రోగివైద్యులు తగలరాని తాకకూడని తారతమ్యాలు ఎంతకాలం ఇంకెంత దూరం రోగాన్ని రానీయని రోగనిరోధకత ఒకనాటి మన జనజీవనంలో లేదా మానవ వ్యాధుల కారణం మనసులో వెదికిన మహనీయపు యోగశాస్త్రము మనది కాదా ఆహార విహార నియమాలలో ఆరోగ్యం ఆసన ప్రాణాయామాలలో వ్యాయామం పండగపబ్బాల ప్రసాదాలలో పుష్టికరం కలగలపి అందించలేదా ఆరోగ్య సౌభాగ్యం నవీన వైద్య పరిశోధనలకు నమస్కరిస్తూనే అత్యవసరాన ఆధునికతను ఆశ్రయిస్తూనే ఉపరాష్ట్రపతి ఉద్భోధ ఉత్తమోత్తమని అనుభవ దార్శనికుని ఆలోచనామృతమని క్రిమిసంహారక పోరులో క్రియాశీలమై నివారణాన్వేషణ కృషికి నిబద్ధులమై ఆయుర్వేదము అవతరించిన అవనిలో భారతీయతను అందుకు సమాయత్తం చేద్ధాం వేదభూమి విశిష్ఠతను విశ్వానికి చాటుదాం!                           ***** కప్పగంతు జయరామయ్య పొందూరు - ప్రకాశం జిల్లా Phone : 9912...

పుణ్యచరితుడు (పున్నమి కవిత)

Image

దార్శనికుడు(పున్నమి)

Image
శ్రీ కప్పగంతు జయరామయ్య గారికి, జన్మదినం సందర్భంగా గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారికి మీరు పంపించిన కవితా శుభాకాంక్షల సందేశం అందినది. మీ శుభాకాంక్షలకు ఉపరాష్ట్రపతి గారు ధన్యవాదములు తెలియజేయమన్నారు. with regards, Prasanth Kumar Reddy, IAS:09:OR, Private Secretary to the Vice President of India VP Secretariat, 6, Maulana Azad Road New Delhi - 110011 Ph: 011-23016344/23016422

మాం పశ్యతి సర్వత్ర ( కరోనా కవిత- 3 )

Image
      * మాం పశ్యతి సర్వత్ర * గుళ్ళన్నీ మూతబడ్డాయి!ఇంకెక్కడి దేవుడ్రా! అంటూ వినిపించిందొక ధిక్కారం 'మాం పశ్యతి సర్వత్ర' యంటూ సామాన్యులకు నిరాకారమై శాస్త్రజ్ఞులకు సాకారమై ప్రకృతి సమతౌల్యం కోసం పర్యావరణ పరిరక్షణ కోసం కరవాలం బట్టి కల్క్యావతారమై కరోనాగా మారి కసికసిగా ప్రపంచమంతా పర్యటిస్తుంది బదులొచ్చిందొక సమాధానం ప్రశ్నకు సమాధానం ప్రశ్నే వస్తుంది వాదనకు ప్రతివాదనా ఉంటుంది వ్యక్తావ్యక్తమైన ఆ శక్తి కోసం అనంత చర్చలు నిరంతర అధ్యయనాలు సత్యాసత్యాలు అనిశ్చితాలయ్యే తర్కంలో ఏదీ నిజం కాదు! ఏదీ అబద్ధం కాదు! శతాబ్దాల మానవ విశ్వాసాలకు కరోనా ముగింపు పలుకుతుందంటే అత్యాశే! యుగాలు గడిచినా వీడని సందిగ్ధం తరాలు మారినా తీరని సందేహం నిరంతర అన్వేషణలో బుద్ధిజీవుల ఆపసోపాలు కాలగమనంలో కనిపిస్తుందేమో పరిష్కారం సమాజ కాలుష్యం సర్వదా అనర్ధదాయకం మానవకల్యాణ దోహదాంశం ఏదైనా ఆహ్వానదాయకమే!              కప్పగంతు జయరామయ్య              పొందూరు, ప్రకాశం-జిల్ల...

కావాలి కదనారంభం (కరోనా కవిత-2)

https://www.youtube.com/watch?v=fwQBKiJbD-M             * కావాలి కదనారంభం * ప్రపంచమంతా వ్యాపించిన కరోనా తూకమేస్తే ఒకటన్నర గ్రాములేనట ఎంత అల్పజీవి కెంతటి అనంతశక్తి భూలోకవాసులపై బహుముఖ సమరం కనికరం లేని కరాళ కిరాత హననం అగ్రరాజ్యాలు ఆర్తితో అల్లాడుతున్నాయి అణ్వాయుధ దేశాలు హడలి చస్తున్నాయి కళ్లెదుటే కనబడుతున్న శవాలగుట్టలు చూసి హాహాకారాల రోదనలతో అలమటిస్తున్నాయి భూగోళాన్నే క్షణాలలో బూడిద చేయగల యుద్ధబాంబులున్న బడా బడా దేశాలు వైరస్ విధ్వంసక విస్ఫోటనం దాటికి నివ్వెరబోయి నీరసపడుతున్నాయి కూలిన ఆర్ధిక సౌధాల క్రింద ఆకలి కేకల ఆక్రందనలనోదార్చలేక తల్లడిల్లుతున్నాయి పలు సేవారూపాలు ప్రాణాలకు తెగించి అవిశ్రాంతంగా పోరాడుతూనే ఉన్నాయి కర్కశ కరోనాకూ ఓ యుద్ధనీతి ఉంది వాటేసుకొంటేనే వెంటబడి కాటేస్తుంది స్వీయరక్షణకు తలవంచుతుంది పరిశుభ్రతుంటే ప్రాణమిడుస్తుంది ఏ కలుషిత సంపర్కమో కల్పిత పిశాచమో మరే దుర్మార్గమో కరోనా జన్మకు కారణమైనా విజ్ఞానవీరుల విశాల పరిశోధనకు తలొగ్గి తన చావు రహస్యం మెల్లగా తానే చెప్తుంది నివారణల దివ్యౌషధమూ అవతరిస్తుంది అంతటితో ఆగరాదు ఈ కదనోత్సాహం...