నివారణాన్వేషణ (కరోనా కవిత -4)
* నివారణాన్వేషణ *
కరోనాతో కలసి సహజీవనం
అనివార్యమంటోంది జనవాక్యం
ఎన్నాళ్ళీ మాస్కు ధారణలు
ఎన్నాళ్ళీ కరశుద్ధి లేపనాలు
ఎన్నాళ్ళీ భౌతికదూర వియోగాలు
ఎన్నాళ్ళీ బతుకుబాట నిరోధకాలు
తల్లీబిడ్డలు భార్యాభర్తలు రోగివైద్యులు
తగలరాని తాకకూడని తారతమ్యాలు
ఎంతకాలం ఇంకెంత దూరం
రోగాన్ని రానీయని రోగనిరోధకత
ఒకనాటి మన జనజీవనంలో లేదా
మానవ వ్యాధుల కారణం మనసులో వెదికిన
మహనీయపు యోగశాస్త్రము మనది కాదా
ఆహార విహార నియమాలలో ఆరోగ్యం
ఆసన ప్రాణాయామాలలో వ్యాయామం
పండగపబ్బాల ప్రసాదాలలో పుష్టికరం
కలగలపి అందించలేదా ఆరోగ్య సౌభాగ్యం
నవీన వైద్య పరిశోధనలకు నమస్కరిస్తూనే
అత్యవసరాన ఆధునికతను ఆశ్రయిస్తూనే
ఉపరాష్ట్రపతి ఉద్భోధ ఉత్తమోత్తమని
అనుభవ దార్శనికుని ఆలోచనామృతమని
క్రిమిసంహారక పోరులో క్రియాశీలమై
నివారణాన్వేషణ కృషికి నిబద్ధులమై
ఆయుర్వేదము అవతరించిన అవనిలో
భారతీయతను అందుకు సమాయత్తం చేద్ధాం
వేదభూమి విశిష్ఠతను విశ్వానికి చాటుదాం!
*****
కప్పగంతు జయరామయ్య
పొందూరు - ప్రకాశం జిల్లా
Phone : 9912117372
Comments
Post a Comment