మాం పశ్యతి సర్వత్ర ( కరోనా కవిత- 3 )
* మాం పశ్యతి సర్వత్ర * గుళ్ళన్నీ మూతబడ్డాయి!ఇంకెక్కడి దేవుడ్రా! అంటూ వినిపించిందొక ధిక్కారం 'మాం పశ్యతి సర్వత్ర' యంటూ సామాన్యులకు నిరాకారమై శాస్త్రజ్ఞులకు సాకారమై ప్రకృతి సమతౌల్యం కోసం పర్యావరణ పరిరక్షణ కోసం కరవాలం బట్టి కల్క్యావతారమై కరోనాగా మారి కసికసిగా ప్రపంచమంతా పర్యటిస్తుంది బదులొచ్చిందొక సమాధానం ప్రశ్నకు సమాధానం ప్రశ్నే వస్తుంది వాదనకు ప్రతివాదనా ఉంటుంది వ్యక్తావ్యక్తమైన ఆ శక్తి కోసం అనంత చర్చలు నిరంతర అధ్యయనాలు సత్యాసత్యాలు అనిశ్చితాలయ్యే తర్కంలో ఏదీ నిజం కాదు! ఏదీ అబద్ధం కాదు! శతాబ్దాల మానవ విశ్వాసాలకు కరోనా ముగింపు పలుకుతుందంటే అత్యాశే! యుగాలు గడిచినా వీడని సందిగ్ధం తరాలు మారినా తీరని సందేహం నిరంతర అన్వేషణలో బుద్ధిజీవుల ఆపసోపాలు కాలగమనంలో కనిపిస్తుందేమో పరిష్కారం సమాజ కాలుష్యం సర్వదా అనర్ధదాయకం మానవకల్యాణ దోహదాంశం ఏదైనా ఆహ్వానదాయకమే! కప్పగంతు జయరామయ్య పొందూరు, ప్రకాశం-జిల్ల...