పుత్రవేదన ( గేయం )
** పుత్రవేదన **(గేయం)
పల్లవి:
అమ్మా!నిను ఒక్కసారి చూడాలమ్మా!
రగులుతున్న గుండె బాధ చెప్పాలమ్మా!
మాతృసేవ పరమార్ధం మరచానమ్మా!
కన్నీళ్ళతో కవిత వ్రాసె వినరావమ్మా!
అమ్మా! అమ్మా! అమ్మా! అమ్మా!
చరణములు:
1.పాలిచ్చి ప్రాణమిచ్చి పాలన చేసి
ఆపదల బారినుంచి అనునిత్యం రక్షించి
అమ్మవైన నిన్ను నేను ఆదరించలేదమ్మా!
నీ ఆశలు వమ్ము చేసి పాపాత్ముడినైతినమ్మా! ॥
2.కొసరి కొసరి గోరుముద్దలెన్నో తినిపించినావు
మలమూత్రములన్ని కడిగి మాతృమూర్తివైనావు
మంచాన పడిన నిన్ను మనసారా చేరదీక
వేదనకు గురిచేసిన దయలేని కొడుకునమ్మా! ॥
3.నా పాపం తలచుకొంటె నాకే సిగ్గేస్తుంది.
నీ రూపం మెదలుతుంటె దుఃఖంఉబికొస్తుంది.
తల్లి మనసు కనుక నీవు నన్ను క్షమియించినా
నా అంతరాత్మ ఎన్నటికి నన్ను క్షమియించదమ్మా! ॥
*****
రచన: కప్పగంతు జయరామయ్య (2015)
పొందూరు
phone: 9912117372
Comments
Post a Comment